దబ్బల రాజారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

1533

అనారోగ్యంతో కన్నుమూసిన వైసీపీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు దబ్బల రాజారెడ్డి పార్థివ దేహానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులర్పించారు. సూళ్లూరుపేట రాజారెడ్డి నివాసానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ వెంట నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసీపీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.