దిద్దుబాటు మొదలైందా..?

323

మహా సంప్రోక్షణకోసం తిరుమల ఆలయాన్ని 6రోజులపాటు మూసివేయడంతోపాటు, భక్తులకి కూడా కొండపైకి అనుమతి లేదంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటుకు సిద్ధమైనట్టుంది. మహా సంప్రోక్షణ కార్యక్రమంపై కాసేపటి క్రితం టీటీడీ అధికారులతో చర్చించిన ఆయన, గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలనే అనుసరించాలని సూచించారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయరాదని అన్నారు. మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని.., పూజాది కార్యక్రమాలకు అవాంతరాలు కలుగకూడదని అధికారులకు స్పష్టం చేశారు. దీంతో పరిమిత సంఖ్యలో భక్తుల అనుమతిపై టీటీడీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.