దేవుడి సొమ్ము హాం ఫట్..

446

దేవాలయాలే వారి టార్గెట్, నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకూ 20 ఆలయాల్లో ఆ దోపిడీ ముఠా దొంగతనాలకు పాల్పడింది. చివరకు ఈ ముఠా నాయుడుపేట పోలీసుల చేతికి చిక్కింది. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట పెళ్లకూరు, ఓజిలి, చిల్లకూరు, మండలాల్లో సుమారు 20 దేవాలయాల్లోని హుండీలు, బంగారు ఆభరణాలు, వెండి సామాన్లులను వీరు దొంగలించారని డీఎస్పీ రాంబాబు తెలిపారు. నిందితులలో సాలార్ ఖాన్, రవి, ధనరాజ్,వెంకటేష్, టెంపుల్ రెక్కి నిర్వహించి దొంగతనాలు చేశామని విచారణలో తేల్చారు. నిందితుల నుంచి 77 గ్రాములు,బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. 29 నేరాలను ఇప్పటి వరకు చేసిన్నారని.. సాలార్ ఖాన్ పై ఇప్పటి వరకు 10 కేసులు ఉన్నాయని వివరించారు. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట సర్కిల్ లలోని దామా నెల్లూరు, డేగవారి కండ్రిగ, కురుగొండ, గ్రద్ద గుంట, వాకాడు, దుగ్గారాజు పట్నం, మౌమిడి,అంకులపాటూరు, తిక్కవరం, పొన్నవోల, అయ్యవారిపాళెం, విద్యానగర్, గూడలి, అరవపాళెం, ఏల్లసిరి, చెంబేడు, ఆరూరు, శిరసంబేడు, జీలపాటూరు, పాల్లుచూరు, పున్నబాక దేవాలయాల్లో చేయగా, సీఎన్ పేటలోని బుట్టారాణమ్మ ఇంట్లో దొంతానాలు చేశారని డీఎస్పీ వివరించారు. బాధితులు నాయుడుపేట సీఐని కలిసి వాటి వివరాలు తెలిపితే సొమ్ము అప్పగిస్తామని తెలిపారు.