ధరల స్థిరీకరణ పేరుతో దగా..

316

జిల్లాలో జరిగిన పసుపు పంట కుంభకోణంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ శిక్షించాలన్నారు. జిల్లాలో పసుపు పంట సాగుతో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారని, అందుకే విచారణ జరపడంలేదని విమర్శించారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పించడం వెనక అసలు కుంభకోణం ఇప్పుడు బైటపడిందని చెప్పారు కాకాణి.