నవ్విపోదురుగాక..

539

చెంబు చచ్చిపోయింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెంబుకి శవయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఓవైపు ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం నవ్వులపాలవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గుర్తు పూర్ణ కుంభంలోనే చెంబు ఉందని అలాంటిది చెంబు చచ్చిపోయిందంటూ అధికారులు, ప్రభుత్వం శవయాత్రలు చేయడం ఎంతవరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలని చెప్పారు.