నిర్లక్ష్యం ఖరీదు..

156

ఐదేళ్ల పిల్లలిద్దరు పార్క్ చేసిన కారులో చనిపోయి ఉండటం సంచలనంగా మారింది. సూరత్ లో బిందోలి ఏరియాలో ఇద్దరు పిల్లలు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. అయితే సాయంత్రం ఐదున్నరకు వారింటిపక్కనే పార్క్ చేసిఉన్న కారులో ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడిఉన్నారు. ఇంటినుంచి పక్కనే ఉన్న దుకాణంకు తినేందుకు చాక్లెట్లు కొనుక్కునేందుకు పోయి ఎంతకీ తిరిగిరాకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. ఇంటిపక్కనే ఉన్న కారులో పిల్లలు ఉన్నా చుట్టుపక్కల అంతా వెతికి వచ్చారు. కారులోకి వెళ్లిన పిల్లలు 48డిగ్రీల ఎండ వేడిని తట్టుకోలేక ఊపిరాడక కారులోనే స్పృహ తప్పి ఆ తర్వాత చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. పార్క్ చేసి ఉన్న కారులోకి పిల్లలు పోయిన తర్వాత ఆటోమేటిక్ గా లాక్ పడిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే అటువంటి పరిస్థితి ఎదురయితే పిల్లలు కారు అద్దాలుపై కొట్టి శబ్దం చేసి ఇతరులను అప్రమత్తం చేసి ఉండొచ్చని ఏం జరిగిందో విచారణ తర్వాత చెప్పలేమని చెబుతున్నారు. కారు యజమానిని కూడా ప్రశ్నిస్తున్నారు.