నెల్లూరుకు చేరుకున్న మృతదేహాలు

1131

కృష్ణానది పడవ ప్రమాదంలో మృతి చెందిన నెల్లూరు జిల్లా వాసుల మృతదేహాలు స్వస్థలానికి చేరాయి. ఓజిలి మండలం కురుగొండకు చెందిన లలితాదేవి, హరిత, చిన్నారి అశ్విక బోటు ప్రమాదంలో చనిపోయారు. ఘటన జరిగిన తర్వాత వీరి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం జిల్లాకు తరలించారు. మృతురాలు హరిత సీపీఐ జాతీయ నేత నారాయణకు సోదరి అవుతారు. నారాయణ కూడా హైదరాబాద్ నుంచి కురుగొండకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.