నెల్లూరు,సంతపేట మార్కెట్ స్లాబ్ కూలింది…

125

నెల్లూరు,సంతపేట మార్కెట్ స్లాబ్ కూలింది…
అభివృద్ధి ముసుగులో అవినీతికి సాక్ష్యం…
——————–///————-///—————–///
నెల్లూరు నగరంలో హడావుడి అభివృద్ధి పేరుతో కోట్లు దోచేస్తున్నారు.. నెల్లూరు సంతపేటలో నిర్మిస్తున్న మటన్ మార్కెట్ స్లాబ్ ముందు భాగం కుప్పకూలింది.. నిర్మాణ దశలోనే భవనాన్ని ఎంత నాసిరకంగా నిర్మిస్తున్నారో ఇదే సాక్ష్యం.. నగరంలో రోడ్లు, కాలువల పనుల్లో నాణ్యత లోపించి, కోట్లకు కోట్లు దోచుకుంటున్నా అడిగే నాధుడే లేడు.. వారానికి లేచిపోయే రోడ్లు, ఇసుక రోడ్లు, ప్రమాణాలకు అనుగుణంగా లేని పనులు.. ఇలా నెల్లూరులో విచ్చలవిడిగా కాంట్రాక్టర్లు, రాజకీయ కాంట్రాక్టర్లు దోచేస్తున్నారు.. తాజాగా నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవనం స్లాబ్ కూలడం మరో నిదర్శనం….