నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న ఖాకీ కలుపుతీత..

4919

బుచ్చిరెడ్డిపాలెం సీఐ సుబ్బారావును సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. సుబ్బారావుపై అనేక అవినీతి, అక్రమాలకు సంబంధించి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పంపిన నివేదిదక ప్రకారం, ఆయనపై డీఐజీ సస్పెన్షన్ వేటు వేశారు. ఫిర్యాదుదారులు ఏవైనా కేసులు నమోదు చేసేందుకు వచ్చిన వారిపై పెట్టే సెక్షన్ల విషయంలో లాలూచీ వ్యవహారం చేస్తున్నాడని, రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపారస్తులను బెదిరించి వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాలు తీసుకుంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని, సంఘ వ్యతిరేకశక్తులను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్నాడని, పోలీస్ వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఎస్పీ దృష్టికి రావడం, అవి నిజమని తేలడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని డీఐజీకి నివేదిక పంపారు. నివేదికను పరిశీలించిన డీఐజీ అక్రమాలకు పాల్పడుతున్న సీఐ సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సస్పెండ్ అయిన పోలీస్ అధికారుల్లో సుబ్బారావు 5వ వ్యక్తి.