నెల్లూరు రహదారి రక్తసిక్తం..

1371

నెల్లూరు జిల్లాలో రహదారి మరోసారి రక్తమోడింది. ఇద్దరు లారీ డ్రైవర్లను బలితీసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదాన్ని ఒకటి అతివేగంగా ఢీకొని తుక్కు తుక్కయ్యాయి. డ్రైవర్లిద్దరూ కూర్చున్న సీట్లోనే కూర్చున్నట్టు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఇసుక లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్ ను ఢీకొంది. కర్నాటకకు చెందిన బాబు, తమిళనాడుకు చెందిన ఆర్ముగం అనే డ్రైవర్లిద్దరూ ఘటనా స్థలంలో చనిపోయారు. ఇద్దరు క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.