న్యాయపోరాటానికి సిద్ధం..

1536

ఆత్మకూరు ఆర్.ఐ. జహీర్ పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ చొప్పా రవీంద్రబాబు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో కలసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆత్మకూరు ఘటన వివరాలు తెలియజేశారు. ఆత్మకూరు పోలీసులు బెయిలబుల్ కేసులు పెట్టి టీడీపీ నేతలకు సపోర్ట్ చేయాలని చూశారని అయితే జడ్జి చొరవతోనే వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆర్.ఐ.పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని పోలీసుల తీరుని కూడా వారు తప్పుబట్టారు. మొత్తం ఈ వ్యవహారంపై మంగళవారం కలెక్టర్, ఎస్పీని కలసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.