పుట్టినరోజు పిలుపులకి వెళ్లివస్తూ..

1403

బిడ్డ పుట్టినరోజు వేడుకలకు బంధువుల్ని పిలిచి ఇంటికి వస్తూ తల్లి, నానమ్మ మృతి చెందిన విషాద ఘటన ఇది. నెల్లూరు చంద్రమౌళి నగర్ కు చెందిన అత్తా కోడళ్లు సుబ్బమ్మ, నిరంజని నాయుడుపేట స్వర్ణముఖి బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బంధువుల్ని పిలిచేందుకు మరికొందరితో కలసి వీరు నెల్లూరునుంచి వెంకటగిరికి కారులో బయలుదేరి వెళ్లారు. అక్కడినుంచి నాయుడుపేట వెళ్తుండగా స్వర్ణముఖి నది బ్రిడ్జి వద్దకు రాగేనే కారు, ఆగిఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బమ్మ, నిరంజని అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.