పూజకు నోచుకోని పురాతన విగ్రహాలు…

326

గూడూరు డివిజన్ మనుబోలు మండలం జట్ల కొండూరు గ్రామ పొలిమేరల్లో కొన్నిరోజుల క్రితం పురాతన రాతి విగ్రహాలు బైటపడ్డాయి. వ్యవసాయ బావినుంచి ఈ విగ్రహాలను బైటకు తీసిన రైతు, బావిని పూడ్చి వేసి విగ్రహాలను పక్కన పెట్టేశారు. అయితే వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో పురాతన రాతి విగ్రహాలు పూజకు సైతం నోచుకోలేదు. వేణుగోపాల స్వామి విగ్రహం సహా మరో రెండు విగ్రహాలు పొలాల్లోనే పడవేసి ఉన్నాయి. ఇప్పటికైనా పురావస్తు విభాగం అధికారులు స్పందించి ఈ విగ్రహాలను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.