పెద్దల పండగకు ప్రత్యేక ఏర్పాట్లు..

307

సంక్రాంతి సందర్భంగా నెల్లూరు నగరంలో జరిగే పెద్దల పండగ ఏర్పాట్లను పరిశీలించారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. బోడిగాడితోట శ్మశానం ప్రాంతాలను పరిశీలించిన ఆయన, పెద్దల పండగ పూర్తయ్యే వరకు ఈ పరిసరాల్లో చెత్త డంపింగ్ చేయకుండా ఉండాలని స్థానికులకు సూచించారు. పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలని అధికారులకు చెప్పారు అనిల్. అటు పెన్నా తీరంలో జరిగే గొబ్బెమ్మల పండగ ఏర్పాట్లను కూడా వైసీపీ నాయకులతో కలసి పర్యవేక్షించారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.