పెరిగిపోతున్నారు..

492

మహిళా ఉద్యోగుల్లో ధూమపానం అలవాటు అతి వేగంగా పెరుగుతోందని అసోచాం సంస్థ సర్వేలో తేలింది. ఈ సంస్థకు చెందిన సామాజిక అభివృద్ధి ఫౌండేషన్ గత నాలుగు వారాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ప్రస్తుతానికి దేశంలో మెట్రో నగరాల్లోని ఉద్యోగాలు చేసే యువతుల్లో ఈ ధూమపానం అలవాటు పెరిగిపోతోందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఈ సంస్కృతి పెరుగుతోందని అంచనా వేసింది. పని ఒత్తిడి తగ్గించేందుకు ఇదే మార్గమని వారు భావిస్తున్నట్లు పేర్కొంది. ఇది చాలా ఆందోళనకర పరిణామమని, ధూమపానం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదమన్న సంగతి మహిళలు గుర్తించాలని స్పష్టం చేసింది.