ప్రతి ఇంటి తలుపుతడతాం..

486

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని టీపీగూడూరు మండలం వెంకన్నపాలెంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. కడప జిల్లా ఇంచార్జిగా తాను అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటానని, సర్వేపల్లి నియోజకవర్గంలో తన తనయుడు రాజగోపాల్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు మంత్రి సోమిరెడ్డి. స్థానిక నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు.