ప్రభుత్వం కేసుని నీరుగారుస్తోంది – కాకాణి ధ్వజం

1097

ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరగలేదని, ప్రభుత్వం కేసుని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి. నకిలీ డాక్యుమెంట్లపై జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మీడియా సమావేశం పూర్తవగానే కాకాణి మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు కాకాణి.