ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు..

656

ఉదయగిరి, మే-24: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు వింజమూరు క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ బాలనాగేశ్వరరావు. కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, సెక్టార్ మీటింగ్ లో పాల్గొన్నారు. గర్భిణుల వివరాలను, చిన్నారికి టీకాలు వేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుండాలని ఏఎన్ఎంలకు సూచించారు. వడదెబ్బలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.