ప్రేమ వ్యవహారమే కారణమా..?

6578

గూడూరులోని డి.ఆర్.డబ్ల్యు. కాలేజీలో ఫస్ట్ ఇయర్ బయో కెమిస్ట్రీ చదువుతున్న శృతి (19) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గూడూరు నర్సింగరావుపేటలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని శృతి చనిపోయింది. తండ్రి వీరభద్రయ్య నెల్ క్యాస్ట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, తల్లి లక్ష్మి. శృతికి ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ చెల్లెలు ఉంది. జైపూర్ లో అగ్రికల్చర్ కోర్స్ చేరతానంటూ కొన్నిరోజులుగా ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతూ వచ్చిన శృతి, వారు అంగీకరించకపోవడంతో ముభావంగా ఉండేది. సడెన్ గా ఈరోజు మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటినుంచి వచ్చిన తల్లి కొన ఊపిరితో ఉన్న కూతురిని కిందకు దించి 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో ప్రాణాలు కోల్పోయిందని సమాచారం. అయితే ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణం అన్నట్టు అనుమానాలున్నాయి. ఈ కోణంలో 2టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.