ప్ర‌భుత్వాసుప‌త్రిలో ఐపీ విభాగాన్ని ప‌రిశీలించిన చాట్ల‌

184

ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఐపీ విభాగాన్ని సంద‌ర్శించారు ఆస్ప‌త్రి అభివృద్ది క‌మిటీ చైర్మ‌న్ చాట్ల న‌ర‌సింహారావు. మొద‌టి అంత‌స్తులో వున్న 180 బెడ్లు, 36 ఐసీయు బెడ్ల‌ను ప‌రిశీలించారు. వైద్య సేవ‌లు ఎలా అందుతున్నాయంటూ రోగుల‌ను ఆరా తీశారు. సానుకూలంగా రోగులు స‌మాధానం ఇవ్వ‌డంతో సంతృప్తి వ్య‌క్తం చేశారు చాట్ల‌. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.