ఫ్లెమింగోలకు రూట్ మ్యాప్ ఎవరు చెబుతారు..?

786

మానవ ఊహాశక్తికి అంతుచిక్కని అద్భుతాలు ఫ్లెమింగో పక్షులు. ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల, విదేశాల్లో కాపురం ఉండే ఫ్లెమింగోలు సరిగ్గా గంటకొట్టినట్టు శీతాకాలం ప్రారంభం కాగానే మన దేశానికి వలస వస్తాయి. అందులోనూ సరిగ్గా మన పులికాట్ విడిదికే వచ్చి వాలతాయి. అంత కచ్చితంగా, అన్ని వేల కిలోమీటర్ల దూరం ఫ్లెమింగోలు ఎలా ప్రయాణిస్తాయి. ఎగిరి, ఎగిరి అలసిపోతే కనీసం సముద్రంపై విశ్రాంతికి కూడా అవకాశం లేదే..? ఆకలి వేసినా, అలసట వచ్చినా ఫ్లెమింగోలు ఏంచేస్తాయి, ఎలా ఇంతదూరం వస్తాయి, ఎందుకు తిరిగి వెళ్లిపోతాయి? ఆసక్తి కలిగించే ఆ విషయాలపై ఎన్డీఎన్ ప్రత్యేక కథనం.