బస్సు లారీ ఢీ.. 25మందికి గాయాలు

1175

నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. సామర్లకోట నుంచి మార్చి 27న బయల్దేరిన టూరిస్ట్ బృందం తమ యాత్రను ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తున్న ఈ టూరిస్ట్ బస్సు ఓజిలి మండలం రాజుపాళెం జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని వేగంగా ఢీ కొంది. దీంతో బస్సు లో ఉన్న దాదాపు 25 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్ధితి విషమం గా ఉంది. వీరంతా గూడూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.