బస్ రేడియేటర్ పేలి చిన్నారులకు గాయాలు..

748

స్కూల్ బస్ లో ఇంటి వద్ద నుంచి బయలుదేరిన చిన్నారులు, పాఠశాలకు చేరుకోకుండానే తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. గూడూరు చేడిమాల వద్ద ఈ ఘటన జరిగింది. గూడూరు నారాయణ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు స్కూల్ బస్ లో ఈ ఉదయం ఎక్కారు. బస్సు చేడిమాల వద్దకు చేరుకోగానే ఉన్నట్టుండి రేడియేటర్ పేలింది. రేడియేటర్లో ఉన్న వేడి నీరు విద్యార్థులపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగో తరగతి చదువుతున్న అజయ్(రామాపురం), గౌతమ్ (రాఘవాపురం), ఆరో తరగతి విద్యార్థి అహ్మద్ బాషా (తొణుకుమాల) కు గాయాలయ్యాయి. వీరికి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

2