బాబు… భల్లాల దేవుడు

401

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాహుబలిలో భల్లాలదేవుడు లాంటి వారని విమర్శించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలో ఆయన పర్యటించారు. రాజధాని డిజైన్ కోసం ప్రభుత్వం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవడం రాష్ట్రంలోని మేధావులైన ఇంజినీర్లను అవమానపర్చడమేనని అన్నారు. వైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ప్రొఫెసర్ కంచె ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని ప్రసన్న డిమాండ్ చేశారు.