బావి నీరుతో దాహార్తి తీర్చుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

400

నెల్లూరు లేక్ వ్యూ కాల‌నీలో ఎంతోకాలంగా నిరుప‌యోగంగా ఉన్న బావి నేడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ బావిని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ప్రారంభించారు. బావిలో నీటిని స్వ‌యంగా తోడి ఆ నీటితో దాహార్తి తీర్చుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ స్థానిక ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చే ఈ బావి గ‌త 40 ఏళ్ళుగా శిథిలావ‌స్థ‌లో వుంద‌ని, మ‌ళ్ళీ ఇన్నాళ్ళ‌కు శుభ్ర‌మైన నీటితో జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంద‌న్నారు. స్థానికుల చొర‌వ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు.