బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్.. ముఖ్యమంత్రిగా కుమారస్వామి..?

122

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక్క అడుగు దూరంలో బీజేపీ ఆగిపోవడంతో.. కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కన్నడ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో ఎన్నికల ఫలితాలు హంగ్‌ దిశగా పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల ప్రకారం బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. సాధారణ మెజార్టీకి కొద్ది స్థానాల దూరంలోనే భాజపా నిలిచిపోయిన నేపథ్యంలో కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జేడీఎస్‌ అగ్రనేతలతో మంతనాలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి కోరనున్నారు. గవర్నర్‌ నిర్ణయమే కీలకంగా మారనుంది. జేడీఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.