బుచ్చిరెడ్డిపాలెం వాసులు దుర్మరణం..

3363

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. బుచ్చినుంచి కారులో బద్వేలుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కుగా మారింది. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.