భళా బాలయ్య

1002

నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ విడుదలతో సింహపురిలో సంబరాలు అంబరాన్ని తాకాయి. బాలయ్య అభిమానులు పెద్దసంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకుని హంగామా సృష్టించారు. దీంతో సినిమా హాళ్ళ వద్ద కోలాహలం నెలకొంది. ఇక సినిమా చూసి థియేటర్ నుంచి బైటికి వచ్చిన అభిమానులు, సగటు ప్రేక్షకులు కూడా ‘శాతకర్ణి’ చిత్రం అద్భుతంగా ఉందంటూ, తమ ఆనందాన్ని ఎన్డీఎన్ తో పంచుకున్నారు. నటసింహ బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించాడని పొగడ్తల వర్షం కురిపించారు.