భారీ అగ్ని ప్రమాదం..

902

క‌లిగిరి బ‌స్టాండ్ సెంట‌ర్లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. బస్టాండ్ సెంటర్లో తెల్లవారుఝామున 10 దుకాణాలు తగలబడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు షాపులకి నిప్పంటించ‌డంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. ఈ ఘటనలో సుమారు 20లక్ష‌ల రూపాయల న‌ష్టం వాటిల్లిందని అంచనా.