భారీ భద్రత మధ్య బీజేపీ అధ్యక్షుడి యాత్ర..

961

ప్రత్యేక హోదా నిరసన సెగ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి గట్టిగానే తగిలింది. కర్నాటక ప్రచారం ముగించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షాకు అలిపిరి వద్ద టీడీపీ నాయకులు అడ్డు తగిలారు. కాన్వాయ్ పై దాడి చేయడంతో ఉలిక్కిపడ్డ అధికారులు అక్కడినుంచి సెక్యూరిటీ మరింత టైట్ చేశారు. భారీ భద్రత నడుమ ఆయనను చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంకు తీసికువచ్చారు. రేణిగుంట విమానశ్రయంలో బీజేపీ నాయకులు అమిత్ షా కు వీడ్కోలు పలికారు. అక్కడినుంచి అమిత్ షా ప్రత్యేక విమానంలో గుజరాత్ కు పయనం అయ్యారు.