భూకంపాల భయం వీడండి..

577

ఉదయగిరి, జనవరి-23: నెల్లూరు జిల్లాలో వచ్చిన భూకంపాలు చాలా తక్కువ తీవ్రతతో ఉన్నాయని, వీటివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. ఉదయగిరి, వింజమూరు ప్రాంతాల్లో పర్యటించిన శాస్త్రవేత్తలు.. స్థానికులతో మాట్లాడారు. భూకంపాల తీవ్రత తక్కువగా ఉందని, భూ ప్రకంపనలు 2 లేదా 3 సెకన్లకే పరిమితమయ్యాయని వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ అధికారులతో కలసి గ్రామాల్లో పర్యటించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ ఆధ్వర్యంలో ఈ బృందం జిల్లాలోని ప్రత్యేక పరిస్థితులపై అధ్యయనం చేపట్టింది.