భ‌క్తుల‌కు టీటీడీ షాక్‌

736

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాకిచ్చింది. లడ్డూ ప్రసాదాల ధరను భారీగా పెంచింది. చిన్న లడ్డూ ధర రూ.25 నుంచి 50 కి, కల్యాణోత్సవం లడ్డూ రూ. 100 నుంచి 200 కి, వడ రూ.25 నుంచి 100 కి పెంచింది. పెరిగిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే సిఫారసు లేఖలపై ఇచ్చే లడ్డూ టికెట్లపై మాత్రమే పెంచిన ధరలు వర్తింప చేసింది. దివ్య ద‌ర్శ‌నం, సర్వ దర్శనం భక్తులకు ఇచ్చే రాయితీ లడ్డూల ధరల్లో ఎలాంటి మార్పు లేద‌ని ప్ర‌క‌టించింది.