మద్యం మత్తులో వీరంగం …

1846

నెల్లూరు జిల్లాలోని గూడూరులో విధినిర్వహణలో ఉన్నా పోలీస్ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. గూడూరులోని యల్లావారి వీధిలో ఆవుల శ్రీధర్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. మద్యం తాగిన శ్రీధర్ ఇంటి యజమానీతో గొడవకు దిగడంతో .. ఇంటి యజమాని 100కు సమాచారం ఇచ్చాడు. కాల్ సెంటర్ నుంచి సమాచారం రావడంతో ఒకటో పట్టణ కానిస్టేబుల్ మురళీ మోహన్ మరో హోమ్ గార్డును వెంట తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లారు. మిద్దె మీద మద్యం మత్తులో ఉన్న శ్రీధర్ని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లిన కానిస్టేబుల్ మురళీమోహన్ పై శ్రీధర్ దాడికి దిగాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మురళీ మోహన్ కు రక్త గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ మురళీమోహన్ చికిత్స పొందుతున్నాడు.