సారా వ్యతిరేక ఉద్యమ నేత రోశమ్మ మృతి

1420

కలిగిరి, ఆగస్ట్-7: మద్యపాన నిషేద ఉద్యమ నేత దూబగుంట రోశమ్మ(వర్దినేని రోశమ్మ) ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈమె వయస్సు 93 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామానికి చెందిన రోశమ్మ మద్యపాన నిషేద ఉద్యమానికి రూపకర్త. రెండేళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారామె. మూడు నెలలుగా డయాలసిస్‌ కి కూడా దూరమయ్యారు. రెండ్రోజులుగా ఆహారం తీసుకోలేకపోవడంతో తీవ్ర అస్వస్థత గురై ఈ ఉదయం కన్నుమూశారు.