మరీ ఇంత దారుణమా..

4000

హైవేపై కూడా ఇంత దారుణమైన యాక్సిడెంట్ ఎప్పుడూ చూసి ఉండం. అలాంటిది వెంకటగిరి సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని చూస్తే బైక్ ఎంత స్పీడ్ గా వచ్చిందో అర్థమవుతుంది. ముగ్గురు కుర్రాళ్లు, ఒకరి వయసు 18, ఇంకొకరిది 20, మరొకరిది 24.. పట్టపగ్గాల్లేని స్పీడ్ తో వాహనంపై వెంకటగిరికి వస్తున్నారు. స్పీడ్ కంట్రోల్ చేసుకోలేని స్థితిలోనే వీరు లారీని ఢీకొట్టారు. ఆ వెంటనే ఒక్కొకరు ఒక్కోచోట ఎగిరిపడ్డారు. ఎవ్వరి ప్రాణాలూ దక్కలేదు. ముగ్గురూ స్పాట్ డెడ్. బైక్ పరిస్థితి చూస్తే వీళ్లు కచ్చితంగా వందకు తక్కువ స్పీడ్ లో వచ్చి ఉండరని తెలుస్తోంది. బైక్ ముందు పార్ట్ ఏముక్కకాముక్క విడిపోయింది. ముందు చక్రం రిమ్ము అసలు కనిపించడమే లేదు. ఒక డెడ్ బాడీ బైక్ సీట్ తో సహా పక్కన పడిపోయింది. మృతులకు తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు బాడీలోని పార్ట్ లన్నీ విరిగిపోయినట్టు తెలుస్తోంది. ఎవ్వరూ హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ప్రత్యక్ష సాక్షులు కూడా బైక్ పై వస్తున్న యువకుల అతివేగమే ప్రాణాలు తీసిందని అంటున్నారు.