మహేష్ అభిమానుల కంచు’కోట’

1794

సూపర్ హిట్ సినిమాలు కూడా రెండు వారాలు ఆడితే గొప్ప అనుకునే రోజులివి. స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు కూడా వీకెండ్ కలెక్షన్లపైనే ఆధారపడి బండి లాగించేస్తున్న రోజులివి. అలాంటి రోజుల్లో కూడా ఓ సినిమా 100రోజులు ఆడిందంటే.. అది కూడా మిగతా చోట్ల వారానికే బాల్చీ తన్నేసిన స్పైడర్ లాంటి సినిమా అంటే మీరు నమ్మగలరా? ఈ విచిత్రం నెల్లూరు జిల్లాలోనే జరిగింది. ఈ రేర్ ఫీట్ కి నెల్లూరు జిల్లా కోటలోని రామ్ రాజ్ థియేటర్ కేంద్రమైంది. ఎలా ఆడించారు అనేది పక్కనపెడితే, సినిమాను మాత్రం డైలీ నాలుగు ఆటలతో 100రోజులు లాగించేశారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ నెల్లూరు జిల్లాలో సూపర్ హిట్ గా నిలిచేవి. మిగతా చోట్ల ఎలా ఆడినా నెల్లూరులో మాత్రం 50రోజులు, 100 రోజులకి తగ్గకుండా ఆడేవి. అదే అభిమానం ఇప్పుడు మహేశ్ బాబుపై కూడా ఉంచారు ఘట్టమనేని అభిమానులు. మొత్తానికి ఈరోజుల్లో స్పైడర్ లాంటి సినిమా శత దినోత్సవం పూర్తి చేసుకోవడం హీరో మహేశ్ బాబు సహా దర్శక నిర్మాతలకు కూడా ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటే కాదనగలరా..?