మా అమ్మను నాన్నేకొట్టాడు..

1082

బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన దారుణ హత్యతో అభం శుభం ఎరుగని ఇద్దరు అమ్మాయిలు అనాథలుగా మారారు. మృతురాలు కెజియమ్మకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి షారు వయసు 14ఏళ్లు కాగా, చిన్నమ్మాయి మహిమ కీర్తన వయసు ఆరేళ్లు. తండ్రి అశోక్ తల్లిపై దాడి చేయడాన్ని చిన్నమ్మాయి మహిమ కీర్తన ప్రత్యక్షంగా చూసింది. అడిగిన వారందరికీ అమ్మను నాన్నే కొట్టాడు అంటూ అమాయకంగా చెబుతోంది ఆ చిన్నారి. తల్లి చనిపోయిందనే విషయం కూడా గ్రహించలేని పసితనంలో ఉన్న ఆ అమ్మాయిని చూసి అందరూ కంటతడి పెడుతున్నారు. పెద్దమ్మాయి షారు తల్లి శవాన్ని చూసి తల్లడిల్లి పోతోంది. అటు అమ్మని కోల్పోయి, ఇటు నాన్న కటకటాల వెనక్కు పోయి తల్లీతండ్రీ లేని అనాథల్లా మిగిలిపోయారు వారిద్దరూ.