ముగ్గురి పరిస్థితి విషమం..

526

తిరుమల పాపవినాశనం రహదారిలో ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన 10 మంది భక్తులు శ్రీవారి దర్శనం తరువాత పాపవినాశనం తీర్థం సందర్శించి తిరిగి తిరుమలకు జీపులో పయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న జీపు ఘాట్‌రోడ్‌లో మలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొంది. ప్రమాదంలో పది మంది గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక అశ్వినీ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలందిస్తున్నారు.