ముగ్గురు యువకులు దుర్మరణం..

2629

వెంకటగిరి శివారు ఎంపేడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాళహస్తి మండలం వాగేడు గ్రామానికి చెందిన ఈ ముగ్గురూ వెంకటగిరికి బైక్ లో బయలుదేరారు. గౌతమి కాలేజీ విద్యార్థులు వీరు. ఎదురుగా వస్తున్న మినీ లారీ ఢీకొనడంతో ముగ్గురూ స్పాట్ లో చనిపోయారు. మృతులు చంద్రమౌళి(24), సోమశేఖర్ (20), వెంకటేష్ (18) గా గుర్తించారు.