ముత్తుకూరులో దారుణం

689

ముత్తుకూరు మండలం గోపాలపురంలో దారుణం జరిగింది. ఓ తండ్రి కన్నబిడ్డ గొంతుకోసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘోరంలో ఐదేళ్ల బిడ్డ ప్రాణాపాయంనుంచి బయటపడగా, తండ్రి చిన్నయ్య మరణించాడు. చిన్నయ్య భార్య గతంలోనే అనారోగ్యంతో చనిపోయింది. కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలతో చిన్నయ్య ఆత్మహత్య చేసుకుంటూ బిడ్డను కూడా చంపేందుకు గొంతు కోశాడు.