మూడురోజుల క్రితం ఆత్మహత్య..

1164

గూడూరు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మూడురోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డా ఆ విషయం ఈరోజు వరకు ఎందుకు బైటకు రాలేదు. కేవలం హాస్టల్ నుంచి బైటకు పంపడం వల్లే విద్యార్థి ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ఇంకేదయినా కారణం ఉందా? ప్రస్తుతం గూడూరు పోలీసులు ఈ దిశగా విచారణ జరుపుతున్నారు. మృతుడు సాయి సొంత ఊరు రాపూరు మండలం గుండవోలు గ్రామం. నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఈసీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి సాయి ప్రవర్తన బాగోలేదని కాలేజీ హాస్టల్ నుంచి ఈనెల 14న బైటకు పంపించేశారు. దీంతో అతను స్నేహితుడి గదిలో రెండు రోజులు ఉంటానని చెప్పి అతడితో పాటే రూమ్ లో ఉంటున్నాడు. స్నేహితుడు ఊరికి వెళ్లిపోవడంతో మూడురోజుల క్రితం సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్ లో ఎవరూ లేకపోవడంతో విషయం ఆలస్యంగా బైటకు వచ్చింది. సాయి మరణానికి అసలు కారణం ఏమిటనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.