మొండి గోడల మధ్యే కాపురం..

256

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నెల్లూరు సాలుచింతలలో అధికారులు ఇళ్లు పడగొట్టినా బాధితులు అక్కడినుంచి వెళ్లిపోవడంలేదు. మొండి గోడల మధ్యే ఉంటూ కాపురం ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కూలదోసినా గూడు వదలబోమంటూ అక్కడే ఉన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు బాసటగా వెళ్లిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య, పోలీస్ బందోబస్తుతో ఇళ్లను కూలదోశారు అధికారులు. దీంతో దిక్కులేక, ఎక్కడికీ వెళ్లలేక బాధితులంతా కూల్చి వేసిన ఇళ్ల మధ్యే కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు తమకు పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నారు.