మౌనిక ఆఖరి మెసేజ్..

2597

ఆత్మహత్యకు కొన్ని క్షణాల ముందు రాగమౌనిక పంపిన మెసేజ్ తోటే ఆమె ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె సోదరుడు రాకేష్ కూడా అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకుంటున్నాడు. ఆ మిస్ యు ఆల్, ఆ లవ్ యు ఆల్, థ్యాంక్యూ అంటూ ఆమె పెట్టిన మెసేజ్ చదివిన వెంటనే రాకేష్ కు అనుమానం వచ్చింది. మౌనిక హాస్టల్ కు పరిగెత్తుకెళ్లాడు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడించి మౌనిక, తుదిశ్వాస విడిచింది. డక్కిలి మండలం మాటుమడుగు గ్రామ మాజీ సర్పంచి దువ్వూరు వెంకట స్వామిరెడ్డి మనవరాలు మౌనిక. మౌనిక తల్లిదండ్రులు రాజారెడ్డి, వాణిశ్రీ హైదరాబాద్ లో సెటిలయ్యారు. సెలవల్లో తాతగారింటికి రావడం మౌనికకు ఇష్టం. అలా మాటుమడుగుతో ఆమెకు ఎక్కువ అనుబంధం ఉంది. చదువుకోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన మౌనిక శవమై తిరిగి రావడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.