రక్తమోడిన రహదారి..

471

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మాధవన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు మృత్యువాత పడ్డారు. కేరళ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనటంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను కేరళ రాష్ట్రంలోని కసరకోడ్ వాసులుగా నిర్ధారించారు.