రహ’దారుణం’..

1040

కావలి సమీపంలోని అలిగుంట క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐస్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఒకరు స్పాట్ లోనే మృతి చెందారు. 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నుంచి ఐస్ లోడ్ తో ఈ లారీ నెల్లూరుకు వస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.