రాజకీయ ప్రత్యర్థుల సరదా సంభాషణ..

96

రాజకీయ ప్రత్యర్ధులు వచ్చే ఎన్నికల్లో పందెం కోళ్ళ తరహాలో ఢీ కొట్టుకునే అభ్యర్ధులు ఎదురుపడితే ఎలా వుంటుంది ? నా ఓటు నీకే అంటూ ఛలోక్తులు విసురుకుంటే పరిస్థితి ఆహ్లాదంగా వుంటుంది. డాక్టర్ జడ్.శివప్రసాద్ కుమారుడి పెళ్ళి వేడుకలో ఆత్మకూరు టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు బొల్లినేని కృష్ణయ్య, మేకపాటి గౌతంరెడ్డి ఎదురెదురు పడ్డారు. గత ఎన్నికల్లో మీరు నాకు పని చేశారు.. ఈ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తానంటే ఇంకేం బ్రహ్మాండం అంటూ గౌతంరెడ్డి ప్రస్తావిస్తే, నా ఓటు నీకే వేస్తాలే అంటూ బొల్లినేని కృష్ణయ్య… గౌతంరెడ్డితో అన్నారు. హాస్యరసపూరితమైన ఈ రాజకీయ సంభాషణ ఆసక్తికరంగా మారింది.