రామాయపట్నం-కావలి మధ్య తీరం దాటే అవకాశం..

2562

అండమాన్‌ తీరం వద్ద ఏర్పడిన ‘వర్ద’ తుపాను కావలి వద్ద తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 870 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. 12వ తేదీ రాత్రికి ఇది రామాయపట్నం-కావలి మధ్యలో తీరాన్నిదాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే తీరాన్ని దాటకముందే దీని తీవ్రత క్రమంగా తగ్గే అకాశముందని వాతావరణశాఖ భావిస్తోంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరో వైపు 11వతేదీ రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోస్తాంధ్రలోని మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.