రైతు ద్రోహి చంద్రబాబు

526

కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని ఎన్నికల ముందు పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత హామీని ఉల్లంఘించి రైతులకు ద్రోహం చేశారని జగన్మోహన్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన పాదయాత్ర సభలో విమర్శించారు. రైతులకు ఇప్పటికీ సహకార చక్కెర కర్మాగారం నుంచి దాదాపు 25కోట్లు బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. రైతులకోసం ఏర్పాటు చేసిన కిసాన్ సెజ్ ను గమేషా, కోకో కోలా లాంటి కంపెనీలకు అమ్మేసి రైతులకు ఇవ్వాల్సిన సాగునీటి వాటాను కోకో కోలా కంపెనీకి మళ్లించడం దుర్మార్గమని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రైతులను నిలువునా ముంచేసిందని అన్నారు.