రోకలిబండతో చంపేశాడు

1445

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను రోకలితో మోది దారుణంగా హత్యచేసిన ఘటన నాయుడుపేటలో జరిగింది. కోనేటి రాజుపాలెం, అరుంధతివాడలో పాలెపు శేఖర్, రమణమ్మ అనే దంపతులు నివశిస్తుండేవారు. వీరికి పిల్లలు లేరు. కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల గొడవలు తారాస్థాయికి చేరాయి. భార్యపై కోపంతో భర్త శేఖర్ రోకలితో దాడి చేశాడు. తలపై మోది కిరాతకంగా చంపేశాడు. నాయుడుపేట పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.