రోడ్డున పడ్డ తల్లిదండ్రులు..

1593

ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే రోడ్డునపడేశారు ఆ కొడుకులు. తండ్రి ఆలపాటి కృష్ణయ్య వయసు 82ఏళ్లు, తల్లి పుష్పలత వయసు 72 సంవత్సరాలు. సూళ్లూరుపేట కచేరీ వీధికి చెంది వీరిద్దరి పట్ల కొడుకులు కసాయిల్లాగా ప్రవర్తించారు. ముసలి వయసులో యోగక్షేమాలు చూడాల్సింది పోయి, కనీసం తిండి కూడా పెట్టకుండా ఇంటినుంచి గెంటేశారు. అప్పటి వరకూ వారికి ఆసరాగా ఉన్న షాపుని కూడా కొడుకు లాగేసుకున్నాడు. దీంతో రోడ్డునపడ్డ ఆ తల్లిదండ్రులు నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్ కి హాజరై తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.